తుమ్మలలో ఐద్వా ఆధ్వర్యాన ధర్నా
బాబా చిత్రపటాల దహనం
ప్రజాశక్తి- చింతూరు : మహిళల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడిన యోగా గురువు రాందేవ్ బాబాపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఐద్వా మండల కార్యదర్శి ముర్రం రంగమ్మ డిమాండ్ చేశారు. ఆదివారం తుమ్మల గ్రామంలో ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాందేవ్‌బాబా చిత్రపటాలను దహనం చేశారు. ఈ సందర్భంగా రంగమ్మ మాట్లాడుతూ, యోగా, ఆయుర్వేదానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిత్యం ప్రచారంలో మునిగి తేలుతున్న రాందేవ్‌బాబా, తనకు జన్మనిచ్చిన తల్లి, తోబొట్టువు కూడా ఆడదేనన్న సంగతి మరచి, బరితెగించి మహిళల వస్త్రధారణపై దిగజారుడు పదాలతో మాట్లాడడం సకిరాదన్నారు. బిజెపి మనువాద సిద్ధాంతంలో మహిళలను అణగారిన వర్గాలుగా చూస్తూ, వారితో సహజీవనం చేస్తున్న రాందేవ్ బాబాకు ఇలాంటి మాటలు కాక, మంచిగా ఎలా మాట్లాడగలుగుతారని ప్రశ్నించారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన రాందేవ్ బాబాపై నిర్భయ చట్టం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా అధ్యక్షురాలు మల్లం సుబ్బమ్మ, మడకం గిరిజ, సోయం కిట్టమ్మ.మొట్టం కిట్టమ్మ, రాజమ్మ, పొడియం రాములమ్మ పాల్గొన్నారు.










