Dec 30,2022 23:55

ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌కు సమస్యను వివరిస్తున్న సిపిఎం నాయకులు

ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌కు సిపిఎం నాయకుల వినతి
ప్రజాశక్తి-విఅర్‌.పురం

పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న మండలంలోని రామవరం 104 కుటుంబాలకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ఇళ్ల సర్వే నిర్వహించి పిఎన్‌ నోటిఫికేషన్‌లో చేర్చి బాధిత నిర్వాసిత కుటుంబాలకు ప్యాకేజీ ఇవ్వాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సిపిఎం నాయకులు శుక్రవారం ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ఆదిత్యకు తహశీల్దారు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ ముంపునకు గురైన అన్ని కుటుంబాల వారికి కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా పునరావాసం, ప్యాకేజీ చెల్లించే విధంగా చూడాలని కోరారు. దీనికి స్పందించిన ప్రవీణ్‌ ఆదిత్య మాట్లడుతూ ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్లి అందిరకీ న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం లక్ష్మి, జెడ్పీటీసీ రంగారెడ్డి, సిపిఎం జిల్లా నాయకులు పూనెం సత్యనారాయణ, సర్పంచ్‌ పులి సంతోష్‌ కుమార్‌ ఎంపీటీసీ ప్రదీప్‌ కుమార్‌, సున్నం చంద్రరావు, రామవరం గ్రామ నిర్వాసితులు పాల్గొన్నారు.