ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రామకృష్ణబాబు
ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి 13వ వార్డు పరిధి కేంద్రకారాగారం ఎదురుగా గల రామకృష్ణాపురంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మంగళవారం పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. అందుకు గల కారణాలను స్థానికులనడిగి తెలుసుకున్నారు. కాలనీలో రోడ్లు, కాలువలు, యుజిడి పనులను ఆయన పర్యవేక్షించారు. చాలా రోజుల నుంచి అసంపూర్తిగా వదిలేసిన రోడ్లు, కాలువలు, యుజిడి పనులపై జివిఎంసి కమిషనర్‌కు తెలియజేస్తానని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో వార్డు టిడిపి అధ్యక్షులు పొత్రకండ ధర్మారావు, తెలుగు యువత అధ్యక్షులు తురకపూడి బాలస్వామి, కాలనీ అధ్యక్షుడు భవిరీడు, గుంజ శ్రీనివాసరావు, సూరిబాబు, కాశీ పాల్గొన్నారు.










