Aug 29,2023 23:50

ప్రజాశక్తి - రేపల్లె
మేజర్‌ ధ్యాన్‌చంద్‌ పుట్టినరోజు సందర్భంగా రామకృష్ణ పబ్లిక్ స్కూల్ విద్యాసంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి క్రీడల ప్రాముఖ్యత  తెలపడానికి పాఠశాలలో ఆసక్తి కరమైన క్రీడా విన్యాసాలతో విద్యార్థిని, విద్యార్థులు అలరించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ కుర్రా అవర్ణ మాట్లాడుతూ ధ్యాన్‌చంద్‌ గొప్ప హాకీ క్రీడాకారుడని అన్నారు. ఆయన దేశానికి మూడు ఒలంపిక్స్‌లో స్వర్ణ పతకాలు అందించారని అన్నారు. దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారని అన్నారు. నేటి క్రీడాకారులు హాకీ ప్లేయర్‌ ధ్యాన్‌ చంద్‌ క్రీడా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. తల్లిదండ్రులకు, చదువుకున్న విద్యాసంస్థలకు వన్నెతేవాలని కోరారు. క్రీడాపోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ డాక్టర్ మహేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.