Dec 19,2022 00:09

రామచంద్రయ్య కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తున్న కిరణ్‌ తదితరులు

ప్రజాశక్తి-విఆర్‌.పురం
కూనవరం మండలం, రేపాక గ్రామానికి చెందిన గొంది రామచంద్రయ్య కుటుంబాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) మాజీ నాయకులు ఆదివారం పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐలో గతంలో రామచంద్రయ్య పని చేశారు. ఆయన అనారోగ్యంతో ఈ నెల 15న మరణించారు. దీంతో ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులు రేపాక గ్రామానికి ఆదివారం వెళ్లి రామచంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులు బి.కిరణ్‌, వి.వినోద్‌, కె.నగేష్‌, ఎం రవితేజ, లెనిన్‌, ఎం నాగమణి, అమ్మాజీ, స్థానిక ప్రజా సంఘాల నాయకులు యర్రంశెట్టి శ్రీనివాసరావు, మేకల నాగేశ్వరరావు, బొర్రయ్య, సత్యనారాయణ, తమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.