Sep 04,2023 18:57

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్‌
ప్రజాశక్తి - ఆచంట

            సమాజాన్ని మార్చాలన దృఢ సంకల్పంతో పని చేసిన కమ్యూనిస్టు నాయకుడు దిరిశాల రామారావు అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్‌ అన్నారు. మండలంలోని పెదమల్లంలో సోమవారం దిరిశాల రామారావు సంస్మరణ సభ సోమవారం నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గోపాలన్‌ మాట్లాడుతూ రామారావు పెదమల్లం గ్రామంలో సిపిఎం సీనియర్‌ నాయకులుగా ప్రజా సామాజిక సమస్యలపై నిరంతరం అలుపెరగని పోరాటం సాగించేవారని కొనియాడారు. ఆయన ఏ సమస్య వచ్చినా ప్రజా ప్రతినిధులను, అధికారులను ఒప్పించి, మెప్పించి ఆ సమస్యను పరిష్కరించేవరకు నిద్రపోయేవారు కాదని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ముఖ్యంగా పెదమల్లం గ్రామంలో వైద్య సౌకర్యం అంతంతమాత్రంగా ఉండే నేపథ్యంలో జిల్లా డిఎంహెచ్‌ఒతో పోరాడి ఆరోగ్య సబ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసే వరకు అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు, సిపిఎం నాయకులు వద్దిపర్తి అంజిబాబు, సిర్రా నరసింహమూర్తి, బొర్రా ధర్మారావు, తలుపూరి బుల్లబ్బాయి, దిరిశాల వెంకటనారాయణ, చింతపల్లి వెంకటరావు, గంగరాజు, రంగారావు, సత్యనారాయణ పాల్గొన్నారు.