పీలేరు : రాక్షసత్వానికి నిదర్శనం చుండూరు నరమేధమని ప్రజాసంఘాల నాయకులు తెలిపారు. ఆదివారం పీలేరు పట్టణంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి చుండూరు నరమేధంలో అశువులు బాసిన మత వీరులకు ఘన నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా మాలమహనాడు అన్నమయ్య జిల్లా ఉపాద ó్యక్షులు జెట్టి మల్లికార్జున, జాస్ అన్నమయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు గుండ్లురు రాజేశ్వరి, బి ఎస్‌పి పీలేరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి చీకటిపల్లి ఎర్రప్ప, రాష్ట్ర గిరిజన సమైక్య నియోజకవర్గ అధ్యక్షులు కిల్లా విజరు కుమార్, ఏపిఎంపిఎస్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు వేలూరు గురునాధం, మాలమహాసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లిగారి వెంకటస్వామి, డిబిఎస్ యాప్ జిల్లా అధ్యక్షులు బద్దె భానుప్రకాష్ మాట్లాడారు. రాజ్యాంగం ఇచ్చిన సర్వమానవ సమానత్వ స్పూర్తితో కల్పించిన ప్రాతినిధ్య హక్కుల అమలులో పాలక కులాలు ఎన్నో అవాంతరాలు కల్పించనప్పటికీ, దళితులు విద్యా సముపార్జన ద్వారా ఒక చైతన్యవంతమైన సమాజంగా పరిణామం చెందడం ప్రారంభమైందని తెలిపారు. దళితుల్లో వస్తున్న ప్రశ్నించే స్వభావాన్ని జీర్ణించుకోలేక పొయిన అగ్రవర్ణాలు, ఎప్ప టికప్పుడూ దళితుల మీద దాడులకు, దోపిడీలకు తెగబడుతూనే ఉన్నాయని వాపోయారు. ఈ క్రమంలో జరిగిన మరొక అమానుష కాండే చుండూరు నరమేధం అని అన్నారు. కార్యక్రమంలో మాల మహనాడు సీనియర్ నాయకులు కె. గట్టప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణ్ కుమార్, జాస్ రాష్ట్ర లీగల్ అడ్వైజర్ గుండ్లురు సదాశివ, పంచాయతీ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధనాసి వెంకట్రామయ్య, ఏపి మాల మహనాడు నాయకులు బొప్పసముద్రం దామోదర్, మచ్చ రెడ్డెయ్య, చీకటిపల్లి మల్లికార్జున, దప్పేపల్లి అనంద్,మద్దెల గంగాధర్, గుండ్లురూ రవీంద్ర,పాటూరి ప్రసాద్, మూడే రమేష్ నాయక్, గుర్రం లోకనాధం, ద్వారక, ప్రసాద్ పాల్గొన్నారు.అమరవీరులకు నివాళులర్పిస్తున్న దళఙత సంఘాల నాయకులు










