ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని మత్స్యకార గ్రామం రాజయ్యపేటలో డెంగీ కేసు నమోదు కావడంతో సర్పంచ్ పిక్కి అప్పలనరస అప్రమత్తమై శానిటేషన్ పనులను ముమ్మరం చేశారు.ఈ నెల 21న అంబట్టి శంకర్రావు కుమార్తే లావణ్యకు (15) జ్వరంతో బాధపడుతుండగా సాధారణ జ్వరం అనుకుని స్థానిక వైద్యులకు చూపించారు. జ్వరం తగ్గక పోవడంతో 23న విశాఖ కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. అక్కడ టెస్టులు చేయగా డెంగీగా నిర్ధారణ కావడంతో శుక్రవారం గ్రామంలో శానిటేషన్ పనులను ముమ్మరం చేశారు. స్ప్రేయింగ్ చేయించి బ్లీచింగ్ జల్లించారు. గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు గోసల కాసులమ్మ, సర్పంచ్ తనయుడు పిక్కీ కామేశ్వరరావు, సత్తయ్య, కొండలరావు, హెచ్‌ఎస్ బి.సత్యనారాయణ, హెచ్‌వి ఎం పార్వతి, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, ఏఎన్‌ఎం వెంకటలక్ష్మి పాల్గొన్నారు.










