ప్రజాశక్తి-కాకినాడ భారత రాజ్యాంగం శాస్త్రీయ దృక్పథంతో కూడినదని ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు అన్నారు. ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో జెఎన్‌టియుకెలో రెండు రోజుల జాతీయ వర్క్ షాప్ ఆదివారం ప్రారంభమైంది. కార్యవర్గ సభ్యుడు జి.మురళీధర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో ఎంఎల్‌సి ఐవి మాట్లాడుతూ భారత ప్రభుత్వం డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని, సైన్స్ భావజాలాన్ని ప్రాధాన్యత లేని అంశంగా చూడటం, అశాస్త్రీయ, నిరాధార, అలౌకిక విషయాలను ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. వర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జివిఆర్ ప్రసాద్ రాజు మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం అభివద్ధి చెందడానికి, సమాజ పురోగతికి శాస్త్రీయ దక్పథం కీలకమె ౖనదన్నారు. జనవిజ్ఞాన వేదిక ఇతర సైన్ సంస్థలు దేశవ్యాప్తంగా శాస్త్రీయ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమని, మూఢవిశ్వాసాలు విడనాడి సమాజం మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంన్నారు. జెవివి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ చెలికాని స్టాలిన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కులం ప్రాచీన మూఢాచారమని తన రచనల ద్వారా తెలియపరచారన్నారు. విజ్ఞాన శాస్త్రానికి వ్యతిరేకమైన కులం నేడు సమాజ సుస్థిర పురోభివద్ధికి ఆటంకంగా మారిందన్నారు. ఆశా మిశ్రా అరుణభ్ మిశ్రా మాట్లాడుతూ నవంబర్ 7 నుంచి 2024 ఫిబ్రవరి 28 వరకు దేశవ్యాప్తంగా శాస్త్ర ప్రచారం నిర్వహించేందుకు ఈ రిసోర్స్ పర్సన్స్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నామన్నారు. సామాజిక న్యాయం, మహిళా విద్య, శాస్త్రీయ దక్పథం వంటి అంశాలపై కళాజాతాలు, మేజిక్ షోలు వంటి వివిధ రూపాలు ద్వారా ఈ ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వర్క్ షాపులో జెవివి ప్యాట్రన్ డాక్టర్.సిహెచ్. రవికుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్రా రామారావు, డాక్టర్ కాదా వెంకట రమణ, కెఎంఎంఅర్ ప్రసాద్, డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్, బి.శ్రీరామారావు పాల్గొన్నారు.










