Oct 14,2023 22:42

 కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌. రఘు
ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) :
భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ప్రతి భారత పౌరుడు పై ఉందని కె వి పి ఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌. రఘు పేర్కొన్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ ఆధ్వ ర్యంలో శనివారం స్థానిక జ్యోతిబాపూలే విజ్ఞాన కేంద్రం లో ''ప్రమాదంలో రాజ్యాంగం-నేటి కర్తవ్యం'' అనే అంశం మీద సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కష్ణా జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌. రఘు మాట్లాడుతూ దేశంలో మతోన్మాదం పెద్ద ఎత్తున పెరిగి భారత రాజ్యాంగానికి తీవ్ర ప్రమాదం ఏర్పడింద న్నారు. భారతీయులుగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకో వాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు, ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో బిజెపి పాలిత రాష్ట్రాల్లో శాస్త్రీయ దక్పథం తీసివేసి ప్రజల మధ్యన అనైక్యతను సష్టించి తన యొక్క మతోన్మాద ఎజెండాతో ముందుకు వెళుతుందన్నారు. ఈ ప్రమాదాన్ని భారతీ పౌరులుగా మనం కలిసికట్టుగా ఎదుర్కోవాలని బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాం గం భారత ప్రజలది, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడు పై ఉందన్నారు. ప్రముఖ సామాజిక కార్యకర్త జి.వి నాగేశ్వరావు మాట్లాడుతూ పౌరుల హక్కులను పూర్తిగా కాలు రాయబడుతున్నాయని అనేక మానవ హక్కుల నాయకులను ప్రశ్నించే వారిని ఉపచట్టం కింద అరెస్ట్‌ చేసి చిత్రహింసలు పాలు చేస్తున్నారన్నారు.బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడే వారందరినీ జైల్లో వేయడం జరుగుతుందన్నారు. పత్రికా స్వేచ్ఛకు ప్రజాస్వామ్యానికి లౌకిక తత్వానికి తూట్లు పొడుస్తుందని అందరూ ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కె వి పి ఎస్‌ జిల్లా అద్యక్షులు సి హెచ్‌ రాజేష్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌, , జిల్లా ఉపాధ్యక్షులు కె. శర్మ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మిరియాల ఆనంద్‌ బెనర్జీ, మరియు పేటేటీ రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి. పవన్‌ తదితరులు మాట్లాడారు.