Aug 06,2023 23:32

సమావేశంలో మాట్లాడుతున్న పాశం రామారావు

తాడేపల్లి: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగాన్ని కాపాడదామని, సిపిఎం శ్రేణులు అంబేద్కర్‌ విగ్రహాల ముందు ప్రతిజ్ఞ చేయాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపునిచ్చారు. పట్టణ కమిటీ సమావేశం ఆదివారం కొట్టె కరుణాకరరావు అధ్య క్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లా డుతూ బిజెపి పాలనలో రాజ్యాంగానికి ప్రమాదం వచ్చి పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మనుస్మృతుని తీసుకు రావడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రోద్బలంతో మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. అంతేగాక రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని, రాష్ట్రాలకు ఉన్న అధికారాలను పరిమితం చేసి రాజ్యాంగ హక్కులను కూడా నిరా కరిస్తోందని ధ్వజ మెత్తారు. బిజెపి పాలనలో దళితులు, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మణిపూర్‌లో మూడు నెలల నుంచి హత్యలు, మహిళలపై అత్యాచారాలు, గృహ దహ నాలు, లూటీలు జరుగుతున్నా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మణిపూర్‌ పాపం ముమ్మాటికీ బిజెపిదేనన్నారు. ఇప్పటికైనా ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించి ప్రజలను కాపాడాలని కోరారు. మరోపక్క నిత్యావసరాలతో పాటు పెట్రోల్‌, గ్యాస్‌, విద్యుత్‌ ఛార్జీలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాడేపల్లి పట్టణంలో ఆరు వేల మందికి ఇళ్లస్థలాలు, పట్టాలు ఇస్తానన్న ప్రభుత్వ హామీని వెంటనే నిలబెట్టు కోవాలని కోరారు. సమావేశంలో పట్టణ కార్యదర్శి బూరుగ వెంకటేశ్వర్లు, దొంతి టరడ్డి శ్రీనివాసకుమారి, వేముల దుర్గారావు, ఎస్‌.ముత్యాలరావు, డివి భాస్కరరెడ్డి, ఎం.శ్రీనివాసరెడ్డి, వై.బర్నబస్‌ పాల్గొన్నారు.