- తిరువూరులో ప్రచారభేరి ప్రారంభం
ప్రజాశక్తి-తిరువూరు
బిజెపి ప్రభుత్వం అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ఒకవైపు తూట్లు పొడుస్తూ మరో పక్క సామాన్యుడిపై భారాలు మోపుతుందని సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేకల నాగేంద్రప్రసాద్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారభేరి కార్యక్రమాన్ని శుక్రవారం తిరువూరు బోసుబొమ్మ సెంటర్‌లో ప్రారంభించారు. ముందుగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం దేశంలో మత ఘర్షణలను ప్రేరేపిస్తూ రాజకీయ లబ్ధి కోసం తహతహలాడుతుందన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఉపాధి లేక పేదలు ఆకలితో ఆలమట్టిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు గుళ్లపల్లి వెంకటరత్నం, నూకల సత్యనారాయణ, ఎం.ప్రభాకరరావు, ఎస్వీ.భద్రం, ఎస్.వెంకటేశ్వర్లు, బి.వెంకటేశ్వరరావు, ఆకుల రవి, పి.శ్రీనివాసరావు, కె.వి.రత్నం, ఎస్.కె.మస్తాన్, నాగుల్‌మీరా, చప్పిడి సురేష్, ఎం.చింతయ్య, ఎం.ఇజ్రాయెల్, తోట కృష్ణ, సంజీవరావు, జె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-విజయవాడరూరల్: బిజెపి విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారభేరి గోడపత్రిను పి.నైనవరం గ్రామంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చెప్పిడి రాంబాబు, మాతంగి నాగమల్లేశ్వరరావు, సిపిఎం రూరల్ మండల కార్యదర్శి మాతంగి ఆంజనేయులు. నాగోతి ప్రసాదు, ముదిగొండ కోటేశ్వరరావు, అద్దేపల్లి రామారావు, సట్టు శ్రీనివాసరావు, సురేషు సురగాని బుజ్జి, దుర్గారావు పాల్గొన్నారు.










