Aug 26,2023 22:48

మాట్లాడుతున్న ఐలు జిల్లా అధ్యక్షులు రమణారావు

ప్రజాశక్తి - శ్రీకాకుళం లీగల్‌: భారత రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకమని ఐలు జిల్లా అధ్యక్షులు దుంపల రమణారావు అన్నారు. బార్‌ అసోసియేషన్‌ నూతన భవనంలో శ్రీకాకుళం బార్‌ ఐలు సభ్యులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగంపై దాడి జరుగుతోందని దీన్ని న్యాయవాదులు, మేధావులు, అభ్యుదయవాదులు అభ్యుదయవాదులు ప్రతిఘటించాలన్నారు. రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను న్యాయవాదులు కాపాడాలని పిలుపునిచ్చారు. ఇటీవలి కాలంలో న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయని, న్యాయవాదులకు రక్షణ చట్టం తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
నూతన కమిటీ ఎన్నిక
అనంతరం శ్రీకాకుళం బార్‌ ఐలు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా అంధవరపు వెంకటేశ్వర్లు, అధ్యక్షులుగా పి.లక్ష్మీపతి, ప్రధాన కార్యదర్శిగా డొంకాన ఈశ్వరరావు ఎన్నికయ్యారు. వీరితోపాటు మరో తొమ్మిది మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.