Sep 02,2022 23:04

నివాళులర్పిస్తున్న వైసిపి నేతలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్థంతిని వైసిపి, కాంగ్రెస్‌ నేతలు ఘనంగా నిర్వహించారు. వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజశేఖరరెడ్డి సేవలు, సంక్షేమ పథకాలను కొనియాడారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు, అన్నసమారాధనలు నిర్వహించారు.
పేదలకు చీరల పంపిణీ

గాజువాక: 65వ వార్డు, బీసీ రోడ్డు, కాకతీయ కూడలిలో వైఎస్‌ విగ్రహానికి వార్డు కార్పొరేటర్‌ బొడ్డు నరసింహపాత్రుడు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ తిప్పల వంశీరెడ్డి పాల్గొని రెండు వందల మంది పేదలకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు మద్దాల అప్పారావు, ధర్మాల శ్రీనివాస్‌, గంట్యాడ గురుమూర్తి, నాగిశెట్టి శ్రీనివాస్‌, లోకనాధం, మంగునాయుడు. జుత్తు లక్ష్మీ, దేముడు, అడిగర్ల రమణ, ఓలేటి నూకరాజు, అర్జున్‌, మణికంఠ, ఎల్‌ వి రమణ పాల్గొన్నారు.
సీతమ్మధార :ఉత్తర నియోజకవర్గ వైసిపి కార్యాలయంలో సమన్వయకర్త, రాష్ట్ర నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కెకె రాజు ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ వర్థంతిని నిర్వహించారు. వైఎస్‌ సేవలను, అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనియాడారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌, ప్లోర్‌లీడర్‌ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ అల్లు శంకరరావు, స్టాండింగ్‌ కమిటీ మెంబర్‌ సారిపిల్లి గోవింద్‌, కార్పొరేటర్లు కె.అనిల్‌ కుమార్‌ రాజు, పద్మ రెడ్డి, ఆళ్ల లీలావతి, ఉషశ్రీ, కంటిపాము కామేశ్వరి, వి. ప్రసాద్‌, రేయ్యి వెంకట్‌రమణ పాల్గొన్నారు.
పెందుర్తి, వేపగుంట : వేపగుంట కూడలిలో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ పాలాభిషేకం చేశారు. పెందుర్తిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఐఅర్క్‌ డైరెక్టర్‌ కనకరాజు ఆధ్వర్యంలో వద్ధులకు అల్పాహారం అందజేశారు.. కార్యక్రమంలో అన్నంరెడ్డి అజరు రాజ్‌, బైలపూడి భగవాన్‌ జైరామ్‌, 95వ వార్డు కార్పొరేటర్‌ ముమ్మన దేముడు, 97వ వార్డు అధ్యక్షుడు మెంటి మహేష్‌, 94వ వార్డు అధ్యక్షుడు మురళి, 93వ అధ్యక్షుడు వార్డు దాసరి రాజు, నర్సింగ్‌, వినోద్‌,పల్లా రాంబాబు, పీతల రాజు, పీతల విష్ణు, వర్మ, మెంటి సూరిబాబు, కిల్లి అప్పారావు, అంగటి సూరిబాబు, చిప్పల చందు, నారాయణ రెడ్డి, డీఎన్‌ మూర్తి, శ్రీకాంత్‌, నాగేశ్వరరావు, గంటల లీలావతి, పద్మ, విజయ లక్ష్మి,రామరాజు పాల్గొన్నారు.
వద్ధులకు అల్పాహారం పంపిణీ
పెందుర్తి : రాజశేఖర రెడ్డి వర్ధంతి పురస్కరించుకొని లయోల వద్ధాశ్రమంలో ఐఆర్‌కె కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కనకరాజు ఆధ్వర్యంలో వద్ధులకు అల్పాహారం అందజేశారు. కార్యక్రమంలో ఎంపిటిసి అప్పలరాజు పాల్గొన్నారు
ఆరిలోవ : 11వ వార్డు వైసిపి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి పూల మాలలు వేసి నివాళులర్పించారు. వైసిపి వార్డు ఇన్‌చార్జ్‌ గొలగాని శ్రీనివాస్‌, కొరికాన మోహన్‌రావు, సత్యనారాయణ పాల్గొన్నారు.
10 వార్డులో..: వార్డు వైసిపి ఇన్‌చార్జ్‌, మాజీ కార్పొరేటర్‌ జగ్గుపిల్ల అప్పలరాజు ఆధ్వర్యంలో రవీంద్రనగర్‌ జయ ఫంక్షన్‌ హాల్‌లో వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి వైసిపినేతలు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
12వ వార్డులో : వైఎస్సార్‌ వర్ధంతిని పురస్కరించుకొని వార్డు కార్పొరేటర్‌ అక్కరమాని రోహిణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్యశిబిరాన్ని విఎంఆర్‌డిఎ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయ నిర్మల ప్రారంభించారు. కార్యక్రమంలో 20వ వార్డు కార్పొరేటర్‌ మువ్వల లకీë సురేష్‌, వార్డు వైసిపి అధ్యక్షులు కన్నేటి సుబ్బారెడ్డి, రాష్ట్ర సేవాధల్‌ ప్రధాన కార్యదర్శి సత్తి మందా రెడ్డి, అర్జున్‌, సుజాత, మోహన్‌, రొంగళి శ్రీను పాల్గొన్నారు.
13వ వార్డులో : 13వ వార్డు కార్పొరేటర్‌ కెల్ల సునీత ఆధ్వర్యంలో ఆరిలోవ, చివరి బస్టాపు వద్ద వైఎస్సార్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దీనదయాల్‌పురంలో ప్రభుత్వ బాలుర వసతి గృహం విద్యార్ధులకు పండ్లు పంపిణీ చేసారు.కార్యక్రమంలో హాస్టల్‌ పర్యవేక్షణాధికారి వీరయ్య, వార్డు వైసిపి ఇన్‌చార్జ్‌ కెల్ల సత్యనారాయణ పాల్గొన్నారు.
గోపాలపట్నం : 92వ వార్డు పద్మానగర్‌లో జివిఎంసి కోఆప్షన్‌ సభ్యుడు బెహరా భాస్కరరావు ఆధ్వర్యంలో వైయస్సార్‌ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా 700మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.కార్యక్రమంలో వైసిపి ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షులు గౌతమ్‌ రెడ్డి, డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్‌ కుమార్‌, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బాకి శ్యాం కుమార్‌ రెడ్డి, 57వ వార్డు కార్పొరేటర్‌ ముర్రు వాణి పాల్గొన్నారు.
పద్మనాభం : పద్మనాభం జంక్షన్‌లోని వైసిపి కార్యాలయంలో రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎంపిపి కంటుబోతు రాంబాబు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భీమునిపట్నం : స్థానిక ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో రాజశేఖర రెడ్డి చిత్రపటానికి, జంక్షన్‌లో వైఎస్సార్‌ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మూడో వార్డు వైసిపి అధ్యక్షులు అల్లిపిల్లి నరసింగరావు ఆధ్వర్యంలో భారీ అన్నసమారాధనను ఎమ్మెల్యే ముత్తంశెట్టి ప్రారంభించారు. నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జ్జి ముత్తంశెట్టి మహేష్‌,కార్పొరేటర్‌ దౌలపల్లికొండబాబు, ఎఎంసి చైర్మన్‌ యలమంచిలి సూర్య నారాయణ, వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్‌ పెదబాబు, మూడో వార్డు ఇంచార్జి మైలపల్లి షణ్ముఖరావు, రాష్ట్ర యాత వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బాడితబోయిన రాములప్పడు పాల్గొన్నారు.
నాలుగోవార్డులో.: చేపలుప్పాడలో పార్టీ కార్యాలయం వద్ద వార్డు కార్పొరేటర్‌ దౌలపల్లి కొండబాబు ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
టి నగరపాలెంలో వైసిపి నేతలు పొట్నూరు చంద్రశేఖర్‌ ,పల్లా సన్యాసిరావు ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి ఎంపిపి వాసు రాజు, సింగనబంద సర్పంచ్‌ గాడు వెంకటనారాయణ, నీలాపు సూర్యనారాయణ నివాళులర్పించారు.
సింహాచలం: 98వ వార్డు మార్కెట్‌ ఏరియా ప్రధాన కూడలి వద్ద వైసిపి నేత కొలుసు ఈశ్వరరావు ఆధ్వర్యంలో రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని నిర్వహించారు. అడివరం సహకార పరపతి సంఘం అధ్యక్షులు కర్రీ అప్పలస్వామి పాల్గొని పులిహోరా పంపిణీ చేశారు. వైసిపి నేతలు పీతల అప్పలరాజు, నడ్డంపల్లి రామరాజు, కర్రి సత్తిబాబు, వరహాల రెడ్డి పాల్గొన్నారు.
ఆనందపురం : వేములవలస కూడలిలో వైయస్సార్‌ విగ్రహానికి జెడ్‌పిటిసి కోరాడ వెంకటరావు, సీనియర్‌ నేతలు కాకర్లపూడి వరహాలరాజు, శ్రీకాంత్‌రాజు పార్టీ అధ్యక్షుడు బంక సత్యనారాయణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మజ్జి వెంకటరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు గండ్రెడ్డి శ్రీను, బిఆర్‌బి నాయుడు, వైస్‌ ఎంపిపిలు పాండ్రంకి శ్రీను, బోట్ట రామకష్ణ, కోరాడ ముసలి నాయుడు, కాకర వెంకటరమణ, ఉప్పాడ సూరిబాబు, బల్రెడ్డి మహేష్‌ ,పాం డ్రంకి అప్పారావు, పిన్నింటి వెంకటరమణ, చందక అప్పలస్వామి ,లోడగల రమణ, కంచరాపు శ్రీనివాసరావు, కోన శ్రీను, కూరాకుల వెంకటే ష్‌, రౌతు శ్రీను, రౌతు వెంకట్రావు, కోరాడ వెంకటరమణారావు పాల్గొన్నారు.
కంచరపాలెం: 53వ వార్డు కార్పొరేటర్‌ బర్కత్‌ అలీ ఆధ్వర్యంలో పంజాబ్‌ హోటల్‌ దరి పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు, అభిమానులు మధ్య రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
55వవార్డు ధర్మనగర్‌ సిద్దార్థ సేవాసమాజం ఆధ్వర్యంలో రాజశేఖరరెడ్డి వర్థంతిలో కెకె.రాజు పాల్గొన్ని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌, కార్పొరేటర్‌ శశికళ, అల్లు శంకరరావు, కంటిపాము కామేశ్వరి ,వి. ప్రసాద్‌, బులుసు జగదీశ్‌, గుజ్జు వెంకటరెడ్డి, పైడి రమణ, దుప్పలపూడి శ్రీనివాసరావు, కె.పి రత్నాకర్‌, ఆళ్ల శివగణేష్‌, చిరంజీవి, కర్రి రామిరెడ్డి, హరిపట్నాయక్‌, షేక్‌ బాబ్జి, రాఘవులు, తిరుపతి రావు, ప్రసన్న రెడ్డి, గోపి, రత్నం, గంగామహేష్‌, ఎర్రంశెట్టి శ్రీను, జుంజూరు గోవింద్‌, సొండి సురేష్‌, గౌస్‌, కరుణ, లక్ష్మీ,ఎడ్ల శ్రీనివాసరెడ్డి, జామి దాసు, చంటి, నాగలక్ష్మీ, అనురాధ, పద్మా,ధర్మేద్ర పాల్గొన్నారు.