ప్రజాశక్తి-కందుకూరు :దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ చిరస్మరణీయుడని ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం డాక్టర్ వైఎస్‌ఆర్ 14వ వర్ధంతి సందర్భంగా ఆయన పట్టణంలోని వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎంఎల్‌ఎ మహీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎపి ప్రజల ప్రదాత ,జలయజ్ఞ రూపకర్త డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. డాక్టర్ వైఎస్‌ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం అందించే ఘనమైన నివాళి అన్నారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఉలవపాడు : వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి ఉలవపాడు మండలంలో గ్రామ గ్రామాల్లో వైసిపి ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం ఉలవపాడులో స్థానిక బస్టాండ్ సెంటర్లో వైఎస్‌ఆర్ రాజశేఖర్ విగ్రహానికి పలువురు పూలమాలు వేసి నివాళులర్పించారు. వైద్యశాలలో రొట్టెలు పంపిణీ చేశారు.పేదలకు అల్పాహారం అందజేశారు. సర్పంచి మాణిక్యాల నాగలక్ష్మి, వైసిపి మండల అధ్యక్షులు చంద్రశేఖర్ ,పట్టణ పార్టీ అధ్యక్షులు వి కష్ణారెడి,్డ జె సి ఎస్ మండల కన్వీనర్ ధనుకోటి ,ఆప్షన్స్ సభ్యులు ఖాదర్ బాషా, మాజీ ఏఎంసీ సభ్యులు సుబ్బారెడ్డి, మాజీ జెడ్పిటిసి కోటు కోటిలింగం, రాఘవరెడ్డి, ఎ బ్రహ్మయ్య, భీమయ్య, దార్ల కోటేశ్వరరావు, షాజహాన,్ టి కోటేశ్వరరావు పాల్గొన్నారు.










