Aug 26,2023 23:43

పంపిణీ చేస్తున్న జెడ్‌పిటిసి

ప్రజాశక్తి- పెదబయలు:మండలంలో అడుగుల పుట్టు రైతు భరోసా కేంద్రంలో శనివారం రైతులకు రాజ్‌మా విత్తనాలు పంపిణి చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ బొంజు బాబు మాట్లాడుతూ, 300 క్వింటాళ్ల రాజ్‌మా విత్తనాలు ఆయా గ్రామాల్లోని వ్యవసాయ సహాయకులతో పంపిణి చేయడం జరుగుతు ందన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ సత్యనారాయణ, ఎస్‌ఐ పులి మనోజ్‌ కుమార్‌, వైస్‌ ఎంపీపీ కొర్ర రాజబాబు, సీనియర్‌ నాయకులు గంపరాయి సూరయ్య పాల్గొన్నారు.
డుంబ్రిగుడ: మండలంలోని కొర్రాయి పంచాయతీలో సర్పంచ్‌ పి.కొములు, కండ్రుమ్‌ పంచాయితీలో సర్పంచ్‌ ల ఫోరం మండల అధ్యక్షుడు కే.హరి ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో అందించిన రాజ్‌ మా విత్తనాలను గిరి రైతులకు పంపిణీ చేశారు.. కొర్రాయిలో అరకు సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ రుద్ర శేఖర్‌ పాల్గొని రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అందించే విత్తనాలను గిరి రైతులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. సమాజానికి కీడు కలిగించే గంజాయి, నాటు సారా వంటి జోలికి పోకుండా, ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న కాపీ, మిరియాలు, కూరగాయలతో పాటు ఇతర పంటలపై దృష్టి సారించి అభివృద్ధి చెందాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సంతోష్‌ కుమార్‌, వైస్‌ ఎంపీపీలు పి.లలిత, ఎస్‌.ఆనంద్‌, వార్డు సభ్యులు కోగేశ్‌, లక్ష్మణ్‌, శోభన్‌ బాబు, ఎం కృష్ణ పాల్గొన్నారు.