Oct 15,2023 00:26

పల్నాడు జిల్లా: కలెక్టరేట్‌ లోని ఎస్‌. అర్‌. శంకరన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ లో రాజకీయ పార్టీల నాయ కులతో జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీల నాయకులు తమ ప్రాంతాలలో ఎలాంటి ఫిర్యాదులు ఉన్న తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. ఓటర్ల జాబితా, లేదా పోలింగ్‌ కేంద్రాలు, ఓటింగ్‌ ప్రాంతాలు, ఓటింగ్‌ జరిగే కేంద్రాలు, ఓటింగ్‌కు కావలసిన సామగ్రి సరఫరా, ఓటింగ్‌ కేంద్రాల మార్పులు, చేర్పు లకు సంబంధించి ఏమైనా ఫిర్యాదలు ఉంటే లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు. 2024 - ఎన్నికలకు సంబం ధించి, ప్రిపరేషన్‌ ఎలా చేయాలో ఎఫ్‌ఎల్‌ఒసి ఆఫ్‌ ఇవిఎంలు, వి.వి పాట్స్‌ వినియోగించే పద్ధతులను వివ రించారు. సమా వేశంలో అని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌, ట్రైనీ కలెక్టర్‌ కల్ప శ్రీ, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం పాల్గొన్నారు.