ప్రజాశక్తి-గొలుగొండ:సీఎం వైయస్.జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్ తెలిపారు. గురువారం గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కాలికి గాయమైనప్పటికీ వీల్‌చైర్‌లోనే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకున్నారు. పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఈ మూడున్నరేళ్ల కాలంలో 99 శాతం నెర వేర్చామన్నారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. అనంతరం గ్రామంలో నాడు నేడు పథకంలో రూ.18లక్షలతో చేపట్టిన పాఠశాలను అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో గర్బిణీలకు సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, మండల పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ, మండల మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత, మండల వైస్ ఎంపిపిలు సుర్ల ఆదినారాయణ, జక్కు నాగమణి, సర్పంచ్ మాకిరెడ్డి విజయలక్ష్మీ, మండల యూత్ అధ్యక్షులు మాకిరెడ్డి రామకృష్ణనాయుడు, ఉప సర్పంచ్ ఎం.వరహాలబాబు, పిఎసిఎస్ అధ్యక్షులు కిలపర్తి పెద్దిరాజు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ బొందల రాజు పాల్గొన్నారు.
ఎస్.రాయవరం:రాష్ట్రంలో జనరంజక పాలనను సిఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబురావు కొనియాడారు. పెద ఉప్పలం పంచాయితీలో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా సుమారు సచివాలయం, జల జీవన్ మిషన్ ను ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతీ ఒక్కరికి పింఛన్‌లు, పక్కా ఇళ్ళు మంజూరు చేశామన్నారు. రైతు భరోసా, అమ్మఒడి వంటి పధకాలు ప్రవేశపెట్టి ప్రభుత్వం ఆదుకుం టుందన్నారు. సంక్షేమ పధకాల అమలు పై స్థానిక ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వెంకటరమణ, నాగేశ్వరావు, పెద ఈశ్వరరావు, నూకి నాయుడు, గురునాధరావు, శ్రీను, ప్రసాద్, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.










