Aug 18,2023 21:42

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీషా పిఎస్‌

 రాయచోటి : జిల్లాలో స్వచ్ఛమైన ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించాలని కలెక్టర్‌ గిరిషా పిఎస్‌ రాజకీయ పార్టీలను కోరారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లాలో ఓటర్ల జాబితా తయారీ, ఇంటింటికి వెళ్లి ఓటర్ల ధ్రువీకరణ తదితర అంశాల మీద వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాజకీయ పార్టీలన్నీ బిఎల్‌ఎలు, మండల, నియోజకవర్గ ఇన్‌ఛార్జుల వివరాలు సమర్పించాలని గత సమావేశంలో కోరామని చెప్పారు. చాలా పార్టీలు ఇచ్చాయని, ఇంకా ఇవ్వని పార్టీలు వెంటనే ఇవ్వాలని పేర్కొన్నారు. తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించడంలో భాగంగా ప్రతి నియోజకవర్గాల వారీగా అక్కడి రాజకీయ పార్టీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశం మినిట్స్‌ను జిల్లాలోని రాజకీయ పార్టీ ప్రతినిధులకు అందరికీ ఇచ్చామని చెప్పారు. ఒకసారి పరిశీలించి ఇంకా ఏమైనా సూచనలు, సలహాలు ఉంటే ఇవ్వాలని కలెక్టర్‌ కోరారు. ఇంటింటి సర్వేలో అందరూ భాగస్వామ్యమైనప్పుడే మనం తప్పులు లేకుండా ఎన్నికల ఓటర్ల జాబితాను తయారు చేయగలమని రాజకీయ పార్టీ ప్రతినిధులకు సూచించారు. ఓటర్ల జాబితాకు సంబంధించి ఓటర్లను చేర్చడం, తీసివేయడం, సరి చేయడం వంటి వాటికి సంబంధించి వివిధ ఫార్మాట్ల దరఖాస్తులను ఓటర్ల నుంచి తీసుకున్నామని తెలిపారు. వీటిల్లో ఏమైనా సమస్యలుంటే వాటిని తమ దష్టికి తీసుకురావాలని కోరారు. ఇంటింటికి పరిశీలన నిమిత్తం వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోనే ఓటర్‌ జాబితాలో వారు కాకుండా కొత్తవారుంటే వారి నుంచి ఫారం 8 తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులకు కలెక్టర్‌ సూచించారు. పోలింగ్‌ బూత్‌ల హేతుబద్ధీకరణకు సంబంధించి మాట్లాడుతూ సెప్టెంబర్‌ 29 వరకు సమయం ఉందని గడువు ముగిసే దానికి ఒక వారం ముందు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాజకీయ పార్టీలకు ఇందుకు సంబంధించి సమస్యలుంటే తమ దష్టికి తీసుకురావాలని కోరారు. కొత్తగా ఓటర్‌ ఐడి కోసం దరఖాస్తు చేస్తున్న వారి గురించి మాట్లాడుతూ చాలామంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తున్నారని అలా చేసేటప్పుడు ఫొటో, చిరు నామాలలో చాలా తప్పులుంటున్నాయని, వాటిని సరి చేసేలా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కషి చేయాలన్నారు. ఇంటింటి సర్వేలో భాగంగా ఫామ్‌-7లో చనిపోయిన ఓటర్లు దాదాపు 8600 వచ్చాయని వాటిని మరలా ఒకసారి సూపర్‌ చెక్‌ చేస్తున్నట్లు కలెక్టర్‌ వివరించారు. అలాగే ఫామ్‌ -7ను మార్గదర్శకాల మేరకు తీసుకోవాలని తహశీల్దార్లను ఆదేశించారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి అందిన డూప్లికేట్‌ ఓటర్ల వివరాలను ఈ నెల 30 లోగా విచారణ చేసి తుది జాబితా అందించాలని ఆర్డీవోలు, తహశీల్దార్లకు సూచి ంచారు. రాయచోటి, మదనపల్లి, రాజంపేట, కోడూరు మున్సిపాలిటీల పరిధిలో బిఎల్‌ఒలతో సమీక్ష చేసి కమిషన్‌ నిర్దేశించిన మేరకు ఫామ్‌-8 లో వివరాలు పొందాలని కలెక్టర్‌ సూచించారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ ఓటరు జాబితా ఇంటింటి సర్వేపై ఫామ్‌ - 6 నుంచి ఫామ్‌ -11బి వరకు మండల వారీగా అబ్‌స్ట్రాక్స్‌ ఇవ్వాలని కోరారు. మున్సి పాలిటీలలో ఇంటింటి ఓటర్‌ పరిశీలన అనుకున్న స్థాయిలో జరగడం లేదని, కొన్ని పోలింగ్‌ స్టేషన్లో మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయని, మతులు డూప్లికేట్‌ ఓటర్లను పక్కాగా సర్వే చేయాలని కోరారు. ఎన్నికల విధులలో వాలంటీర్లు పాల్గొనకుండా కట్టడి చేయాలన్నారు. జిల్లా కేంద్రం రాయచోటిలో ఇవిఎంలు భద్రపరిచిన గోడౌన్‌ చుట్టూ సిసి కెమెరాలు, పటిష్టమైన భద్రత కల్పి ంచాలని కలెక్టరుకు విన్నవించారు. ఎన్నికల జాబితా తయారీలో ఎక్కడైనా వాలంటీర్లను ఉపయోగించుకున్నట్లు తెలిస్తే ఉపేక్షించేది లేదని, ఆ విషయాన్ని తన దష్టికి తీసుకురావాలని కలెక్టర్‌ తెలియజేశారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు అందించిన సలహాలు, సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని తప్పులు లేని ఓటర్‌ జాబితా రూపకల్పనకు కషి చేస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ, రాయచోటి, రాజంపేట, మదనపల్లి ఆర్‌డిఒలు రంగస్వామి, రామకష్ణారెడ్డి, మురళి, సంబంధిత తహశీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల