ఫ్లెక్సీలు తొలగిస్తున్న సిబ్బంది
ప్రజాశక్తి-నక్కపల్లి:
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో కోడ్ అమల్లోకి వచ్చిందని ఎంపీడీవో సీతారామరాజు తెలిపారు. నక్కపల్లిలో శుక్రవారం ఈ ఓపిఆర్‌డి వెంకటనారాయణతో కలిసి పర్యటించారు. రాజకీయ పార్టీల నాయకుల ఫ్లెక్సీలను పంచాయతీ సిబ్బందితో తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలో 32 పంచాయతీ గ్రామాల్లో రాజకీయ పార్టీల నాయకుల ఫ్లెక్సీలను తొలగింపునకు చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. రాజకీయ పార్టీల నాయకులు సహకరించి ఫ్లెక్సీలను తొలగించాలని కోరారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీల నాయకులు నిబంధనలు ఉల్లంఘించ కూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.










