రాజకీయ లబ్ధి కోసమే వివేకానంద రెడ్డి హత్య
- టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి
ప్రజాశక్తి - పాములపాడు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య రాజకీయ లబ్ధి కోసమే జరిగిందని వైసిపి ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయిన నేటికీ దోషులకు శిక్ష పడలేదని టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి అన్నారు. ఆయన పాములపాడులో ఓ ఫంక్షన్‌లో పాల్గొని విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆనాడు బాబారు వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని ప్రచారం చేసి.. మళ్లీ వెంటనే హత్య చేయబడ్డారని ప్రచారం చేశాడని, ఆనాడు అధికారంలో ఉన్న చంద్రబాబు పైన ఆరోపించారన్నారు. వివేకానంద రెడ్డి హత్యను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయినప్పటికీ కేసు విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడం పట్ల ప్రజలు అసమర్ధ పాలన అనుకుంటున్నారని అన్నారు. సిబిఐ వచ్చినప్పుడు అల్లా జగన్ ఢిల్లీకి వెళ్లి ఆ కేసు విషయంలో టైమ్ తీసుకొని ప్రోలోంగ్ చేస్తున్నారని గౌరు ఆరోపించారు. వివేకానంద కూతురు సునీతమ్మ సిబిఐ వారిని తొందరగా తేల్చాలని కోరుతున్నప్పటికీ ఎలాంటి పురోగతి లేదన్నారు. సునీతమ్మకు మద్దతుగా షర్మిల విజయమ్మ కూడా దోషులకు శిక్ష పడాలని కోరుతున్న వైసిపి ప్రభుత్వం మాత్రం అడ్డంకులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకు సహకరించి దోషులకు శిక్ష పడే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేష్ నాయుడు, నందికొట్కూరు టిడిపి అధికార ప్రతినిధి కాకరవాడ చిన్న వెంకటస్వామి, టిడిపి మండల అధ్యక్షులు హరినాథ్ రెడ్డి, నాయకులు తిమ్మారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, చంద్రశేఖర్, గోవిందు, తెలుగు యువత మండల అధ్యక్షులు మధు, కృష్ణ, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి శివ శంకర్ స్వామి, నాయకులు లక్ష్మి కాంత్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి, అబ్దుల్ హఫీజ్, హనుమంతు నాయక్, ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.










