ప్రజశక్తి - చీరాల
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టిడిపి ఇన్చార్జ్ ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో బైపాస్‌లోని టిడిపి నూతన కార్యాలయంలో చేస్తున్న దీక్షలు శుక్రవారంకు 10వ రోజుకు చేరుకున్నాయి. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం దీక్షలను ప్రారంభించారు. చంద్రబాబుకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక, వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో జగన్ ఉద్దేశ్యంపూర్వకంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు చేశారని అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని ఆరోపించారు. సాయంత్రం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. దీక్షలో టిడిపి పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, ఉసురుపాటి సురేష్, కొండ్రు రత్నబాబు, షేక్ మొహిద్దిన్, లావేటి శ్రీనివాస తేజ, జడ్డు శ్రీహరి, నరాల తిరుపతి రాయుడు, దగ్గుబాటి వెంకట్రావు, సిపాలశెట్టి హరికృష్ణ, కుంచాల రామాంజనేయులు, షేక్ లాల్ అహ్మద్, కౌతరపు నాగేశ్వరి, శింగిరేసు కాళిదాస్, పఠాన్ ఆయుబ్, కొమ్మూరి మహేంద్ర బాబు, పలగర్ల శ్రావణ్, రాసాల శ్రీనివాస్, పాకాల సత్యనారాయణ, గుంటూరు మనోహర్, షేక్ సద్దాం హుస్సేన్, షేక్ రజాక్ పాల్గొన్నారు.










