Sep 16,2023 20:34

కొనసాగిన టిడిపి రిలే నిరాహార దీక్షలు, నిరసనలు
ప్రజాశక్తి - ఆచంట
చంద్రబాబుపై కేవలం రాజకీయ కక్షతో అక్రమ కేసులు బనాయించడం దారుణమని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తనయుడు పితాని వెంకట్‌ తెలిపారు. టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 4వ రోజు శనివారం కొనసాగాయి.ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి ఉప్పలపాటి సురేష్‌ బాబు, నేతలు కేతా మీరయ్య, బీరా నరసింహమూర్తి, తమ్మినీడి ప్రసాద్‌, గొడవర్తి శ్రీరాములు పాల్గొన్నారు.
తణుకు : చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ మాజీ ఎంఎల్‌ఎ ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి విడివాడ రామచంద్రరావు సంఘీభావం తెలిపారు.
తాడేపల్లిగూడెం: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ భీమవరం రోడ్డులో గొర్రెల సూరన్న కాంప్లెక్స్‌ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి వలవల బాబ్జి నాయకత్వంలో చేపట్టిన దీక్షలకు జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్‌, పట్టణ అధ్యక్షులు వర్దనపల్లి కాశి, టిడిపి నేతలు గంధం సతీష్‌, కొండ, పసుమర్తి రామ లక్ష్మణ్‌ సంఘీభావం తెలిపారు.
మొగల్తూరు : ముత్యాలపల్లిలో టిడిపి నాయకులు మోకాళ్లపై కూర్చుని చెవిలో పువ్వుతో అర్ధనగ నిరసన ప్రదర్శన చేశారు. ముందుగా గ్రామంలోని ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు కొల్లాటి బాలకృష్ణ, దొంగ శ్రీను, నాగిడి రాంబాబు, కె.మూలస్వామి, పెదసింగ్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఉండి : చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము జగన్మోహన్‌ రెడ్డికి లేక ఆయనను అక్రమ కేసుల్లో బనాయించి జైలులో పెట్టించారని ఎంఎల్‌ఎ మంతెన రామరాజు, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తుగ నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కార్యాలయం వద్ద నాలుగో రోజు దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా వారు ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. అనంతరం కాగడాలతో పెద్ద వంతెన వరకూ భారీ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కరిమెరక నాగరాజు, కిన్నెర వెంకన్న, పోత్తూరి వెంకటేశ్వరరాజు, రుద్రరాజు సూర్యనారాయణ రాజు, కాగిత సత్యనారాయణ, ముదునూరి కృష్ణంరాజు పాల్గొన్నారు.
నరసాపురం టౌన్‌ : చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ పోస్ట్‌కార్డుల ఉద్యమాన్ని మాజీ ఎంఎల్‌ఎ బండారు మాధవనాయుడు చేపట్టారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పది వేల పోస్టు కార్డులు రాష్ట్రపతి, గవర్నర్‌కు ఈ రోజు నుంచి పంపిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జక్కంశెట్టి వెంకటేశ్వరరావు, కొట్టు పండు, ఎం.రాంప్రసాద్‌, చాగంటి రాము, మాజీ ఎంపిటిసి కె.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
పెనుమంట్ర : చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తనయుడు వెంకట్‌ ఆధ్వర్యంలో జనసేన, టిడిపి నాయకులు మార్టేరు సెంటర్‌లో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తమనంపూడి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి మురళి మోహన్‌రావు, చింతపల్లి రామకృష్ణ, టి.దుర్గారెడ్డి, అచ్యుత రామారెడ్డి, బులిరామిరెడ్డి పాల్గొన్నారు.