Oct 20,2023 16:02

ప్రజాశక్తి - బుట్టాయగూడెం
   టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ మండలంలోని రెడ్డి గణపవరం పంచాయతీలో నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాసులు ఆధ్వర్యంలో డోర్‌ టూ డోర్‌ తిరుగుతూ చంద్రబాబుని ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని ఆరోపించారు. జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న అరాచక పాలనను వివరిస్తూ, బాబుతో నేను అనే కార్యక్రమాన్ని ప్రజలకు వివరించారు. చంద్రబాబుకి మద్దతుగా మేమున్నాం అంటూ 9261292612 నెంబర్‌కు మిస్‌ కాల్‌ ఇప్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు చిలకమూడి సుధాకర్‌, నియోజవర్గ ఎస్‌టి సెల్‌ అధ్యక్షులు మడకం రామకృష్ణ, మండల ఎస్‌సి సెల్‌ మాజీ అధ్యక్షులు బొబ్బర ఎలీషా, బూత్‌ ఇన్‌చార్జి గన్నిన సూర్యచంద్రం, కోర్స దుర్గారావు, బడిశా ముత్యాలరావు, బొబ్బర సందీప్‌, పూసులూరి సర్వారాయుడు, తుంపాటి సుబ్బారావు, చోడెం ప్రసాద్‌, కారం సురేష్‌, తెలుగు యువత సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ మర్రి రమేష్‌ బాబు, మనెల్లి బాలు పాల్గొన్నారు.
   చింతలపూడి : చంద్రబాబుని అరెస్ట్‌ చేయడం ముమ్మాటికి వైసిపి ప్రభుత్వ కక్షపూరిత చర్యేనని, టిడిపి పట్టణ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరావు, జనసేన మండల అధ్యక్షులు చిదరాల మధుబాబు తెలిపారు. టిడిపి ఆధ్వర్యంలో చార్లెస్‌ నగర్‌లో బాబుతో నేను కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం మాట్లాడారు. అనంతరం టిడిపి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్‌ కుమార్‌, జిల్లా సంయుక్త కార్యదర్శి తూము విజరు మాట్లాడుతూ 2024లో టిడిపి, జనసేన కూటమి విజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నలమాటి శ్రీను, సొంగా ఏసుపాదం, నియోజకవర్గ నాయకులు డా.మారుమూడి థామస్‌, నలమాటి రామకృష్ణ, వాసు, జనసేన సైనికులు గుమ్మిశెట్టి భారతి, సునీత, శ్రీను, కుమార్‌, ఆకుల మధు, వంశీ పాల్గొన్నారు.