
ఓబుళదేవరచెరువు : ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి చంద్రబాబు నాయుడును రాజకీయంగా ఎదుర్కొనలేక కక్షతోనే ఆయన్ను జైలుకు పంపారని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఓడి చెరువు మండలం మహమ్మదాబాద్ క్రాస్ నుంచి తిరుమాలకు చేపట్టిన పాదయాత్రను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆందోళనకు గురిచేసి వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలవాలన్న ఉద్ధేశంతో చంద్రబాబును అరెస్టు చేయించారన్నారు. వైసిపి ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు కడిగిన ఆణిముత్యంలా బయటికి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం ఎంపీటీసీ శ్రీనివాసులు, ఆంజనేయులు, నాగేంద్ర, రామాంజనేయులు, రమేష్, బోనాల బాలకృష్ణ ,అంజి, శీన, నిజాం, ఓబుల్ రెడ్డి, ఆర్‌ఎంపి జాకీర్, అంజినప్ప, శంకర్ రెడ్డి పాల్గొన్నారు.