ప్రజాశక్తి-సాలూరు రూరల్ : ఏ తప్పూ చేయని టిడిపి అధినేత చంద్రబాబును ఇన్ని రోజులు జైల్లో ఉంచడం రాజకీయ కక్షసాధింపేనని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి అభిప్రాయ పడ్డారు. బుధవారం మండలంలోని పెద్దబోరబందలో బాబుతో నేను కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి, వారి జీవితాలను బాగు చేయాలని లక్ష్యంతో చంద్రబాబు నాయుడు జీవితమంతా గడిపారని తెలిపారు. అటువంటి వ్యక్తి తప్పు చేశారని వైసిపి సర్కారు కక్షగట్టి ఆయనను జైల్లో పెట్టించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు ఆముదాల పరమేష్, రామకృష్ణ, శ్యామ్, సత్యం, తాడుతూరి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
పరజపాడులో టిడిపి నిరసన ర్యాలీ
గుమ్మలక్ష్మీపురం : జియ్యమ్మవలస మండలంలోని పరజపాడు గ్రామంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి నాయకులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టు గురించి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రతిఒక్కరికీ వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి డొంకాడ రామక్రిష్ణ, ఎంపిపి బొంగు సురేష్, ఎస్‌టి సెల్ అరుకు పార్లమెంటు అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు , తెలుగు రైతు నియోజకవర్గ అధ్యక్షులు గురాన శ్రీరామ్మూర్తి, సర్పంచ్ రామకృష్ణ, ఎంపిటిసి అన్నపూర్ణ, మూడడ్ల సత్యం నాయుడు, శివ్వల నర్సింగరావు పాల్గొన్నారు.










