Aug 22,2022 23:06

జోనల్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న రవ్వ నరసింగరావు తదితరులు

ప్రజాశక్తి -భీమునిపట్నం : జివిఎంసి నాలుగో వార్డు పరిధి నేరెళ్లవలస కాలనీ రాజీవ్‌ గృహకల్ప నివాసితులకు రోజూ తాగునీరు సరఫరా చేయాలని జోనల్‌ కమిషనర్‌ ఎస్‌ వెంకటరమణకు సిపిఎం ఆధ్వర్యాన స్థానికులు సోమవారం వినతి పత్రం అందజేశారు. గృహనిర్మాణ సంస్థ వాటర్‌ టాంక్‌ నిర్మించినప్పటికీ తాగు నీరు అందించే మోటార్లు మరమ్మతుకు గురయ్యాయని పేర్కొన్నారు. తక్షణమే వాటిని బాగుచేసి తాగు నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. గృహ సముదాయంలో దట్టంగా పెరిగిన ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలను తొలగించాలని విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రవ్వ నరసింగరావు, స్థానికులు అన్నా బత్తుల నరసింగరావు, గిడుతూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.