Feb 13,2023 23:41

జెడ్సీ రాము కు వినతి పత్రం అందజే స్తున్న మూర్తి

జోనల్‌ కార్యాలయం ఎదుట సిపిఎం ధర్నా
ప్రజాశక్తి -భీమునిపట్నం :
నాలుగోవార్డు పరిధిలోని రాజీవ్‌ గృహకల్ప సముదాయంలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం భీమిలి జోన్‌ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జోనల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జోన్‌ కార్యదర్శి ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి మాట్లాడుతూ, మరమ్మతుకు గురైన మోటార్లను బాగుచేయించి, తాగునీటి సమస్య పరిష్కరించాలని, కాలువల్లోని పూడికలు తొలగించి, పారిశుధ్యం మెరుగుపరచాలని, నివాసాల మధ్య పేరుకుపోయిన పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలు తొలగించాలని కోరారు.సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు రవ్వ నరసింగరావు, ఎస్‌ అప్పలనాయుడు, అన్నాబత్తుల నరసింగరావు, మాజీ కౌన్సిలర్‌ అనకాపల్లి వెంకటరావు పాల్గొన్నారు అనంతరం జెడ్‌సి బొడ్డేపల్లి రాముకు వినతిపత్రం అందజేశారు.