రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
ప్రజాశక్తి-ఉదయగిరి : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యులు ఉదయగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి దుద్దుకూరు రమేష్ నాయుడు నిర్వహించారు. ఆదివారం స్థానిక మీడియా పాయింట్ ఆవరణంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున, రాష్ట్ర అధ్యక్షులు రుద్రరాజు, డిసిసి అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అతిపిన్న వయసులోనే దేశ 7వ ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రధాని రాజీవ్ గాంధీనేని అలాంటి మహనీయులు జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. పంచాయతీ రాజ్‌కి నిధులు ఇచ్చి గ్రామీణ అభివృద్ధికి తోడ్పడిన గొప్ప మహోన్నత వ్యక్తిగా, దేశంలో ఐటీ శాస్త్ర ఇస్రో తెచ్చిన ఘనత, దేశంలో ఇంతమంది ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ ఘనత కూడా మహోన్నత నేత రాజీవ్ గాంధీ దేనని అన్నారు. అప్పట్లోనే ఎటిఎం బ్యాంకింగ్ రంగం వ్యవసాయంపై హైటెక్ టెక్నాలజీని ముందస్తుగా తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన మరణించకపోయి ఉంటే ఇప్పటిదాకా దేశ ప్రధానిగా కొనసాగే వారిని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024లో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ కావడం ఖాయమన్నారు. ఆయన ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడోయాత్ర ప్రజల అపూర్వ ఆదరణతో విజయవంతంగా ముగిసిందని తర్వాత చేపట్టే నాలుగు రాష్ట్రాల్లో కూడా మరింతగా ప్రజలు ఆదరణ పొంది విజయవంతం అవుతుందన్నారు. 2024 లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఉదయగిరి ఎంఎల్‌ఎ తాను గెలిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధికి ముందుగా ఉదయగిరిని జిల్లాగా ప్రకటిస్తామని దుర్గం సిద్ధేశ్వరం పర్యాటక కేంద్రం చేసి వ్యవసాయానికి పెద్దపీట వేస్తామన్నారు. ప్రతి లింకు రోడ్డును డబుల్ రోడ్డుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి సత్తెనపల్లి బాలయ్య, సీతారాంపురం, వరికుంటపాడు అధ్యక్షులు కానాల హజరత్, దుద్దుకూరు వెంకటేశ్వర్లు, బకీరు హజరత్, యూత్ నాయకులు ప్రశాంత్, అంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.










