Oct 18,2023 23:37

విలేకర్లతో మాట్లాడుతున్న యార్డు చైర్‌పర్సన్‌ చిన్నమ్మాయి

ప్రజాశక్తి - రొంపిచర్ల : తన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు వ్యవసాయ మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన్‌ బత్తుల చిన్నమ్మాయి ప్రకటించారు. ఈ మేరకు స్థానిక యార్డు కార్యాలయంలో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిపై ఉన్న గౌరవంతో రాజీనామాను ఉపసంహరించుకుంటున్నామని చెప్పారు. గత నెల 22న సంతగుడిపాడులో వినాయక విగ్రహ నిమజ్జనం సందర్భంగా జరిగిన గొడవల్లో టిడిపి నాయకులు మంజుల ఆంజనేయులు, అతని భార్య మాజీ సర్పంచ్‌ అంజనీకుమారి, కుమార్తె సౌజన్యపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నట్లుగా వారు ఆరోపిస్తున్నారని, అందులో వాస్తవం లేదని అన్నారు. వారిని వైసిపిలోకి రావాలని ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారని, ఆ దుస్థితి వైసిపికి లేదని, ప్రభుత్వ చేస్తున్న అభివృద్ధి పనుల వల్లే అనేక మంది పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యేపై వారు చేసిన ఆరోపణలను వెనక్కు తీసుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు.