Sep 09,2023 22:21

 జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవిఆర్‌ కృష్ణయ్య
ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) :
రాజీమార్గమే రాజ మార్గం అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ముఖ్యా ఉద్దేశం అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.వి.ఆర్‌ కష్ణయ్య అన్నారు.కష్ణా జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టులలో శనివారం జాతీయలోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కె.వి.ఆర్‌ కష్ణయ్య మాట్లాడుతూ కష్ణాజిల్లాలో వివిధ కోర్టుల పరిధిలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహణ, 42 బెంచీల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు కష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించినట్లు తెలిపారు.కష్ణాజిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టుల పరిధిలో 42 బెంచ్‌ లను ఏర్పాటు చేశామన్నారు కక్షిదారులు తమ పెండింగ్‌ కేసులు పరిష్కరించు కోవడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు.మోటారు వాహన ప్రమాద భీమా కేసు పరిష్కారానికి కక్షిదారు, ఇన్సూరెన్స్‌ కంపెనీ ముందుకు రావడంతో కేసు ఫైల్‌ చేసిన 90 రోజుల్లోగా పరిష్కరించి, బాధితునికి రు. 1.30 లక్షల రూపాయల బీమా మొత్తాన్ని చెక్కు రూపంలో ఈరోజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాధితునికి అందించడం జరిగిందని తెలిపారు.లోక్‌ అదాలత్‌ ల ద్వారా కేసులు పరిష్కరించుకుంటే కాలం, సమయం, డబ్బు వధా కాదని తెలిపారు.90 రోజుల్లోగా మోటారు వాహన ప్రమాద బీమా కేసు పరిష్కరించి మోటారు వాహన ప్రమాద బీమా కేసుకు సంబంధించి జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక చేతులు మీదుగా బాధితునికి రు.1.30 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఫోక్సొ కోర్టు స్పెషల్‌ జడ్జి డాక్టర్‌ షేక్‌ మొహమ్మద్‌ ఫజలుల్ల, మోటారు వాహన ప్రమాద బీమా కేసులో బాధితుడు చిల్లు ముంత వెంకట కష్ణ మోహన్‌, పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఓఎస్‌ఎ శివకుమార్‌, న్యూ ఇండియా ఎస్యురెన్స్‌ కంపెనీ లీగల్‌ అడ్వైజర్‌ లంకిశెట్టి బాలాజీ హాజరయ్యారు.