ప్రజాశక్తి - కౌతాళం
జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయ రాజగోపుర నిర్మాణానికి, అన్నదానానికి కలుదేవకుంట వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులు కె.రఘునాథ్ రెడ్డి, వైసిపి యువ నాయకులు విఖ్యాత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి రూ.2,03,116 విరాళంగా అందజేశారు. శుక్రవారం స్వామివారి దర్శనార్థం ఆలయం చేరుకున్న వారు ఉరుకుందలోని శ్రీనరసింహ ఈరన్న స్వామి దేవస్థాన రాజగోపుర నిర్మాణానికి రూ.1,01,116, శాశ్వత అన్నదానం పథకానికి రూ.1,02,000 అందజేశారు. కలుదేవకుంట గ్రామానికి చెందిన కె.రఘునాథ్ రెడ్డి ఆయన కుమారుడు వైసిపి యువ నాయకులు విఖ్యాత్ రెడ్డి, ఆయన భార్య మంత్రాలయం మండల ఉపాధ్యక్షులు సింధూ ప్రియ రెడ్డి, తల్లిదండ్రులతో కలిసి విరాళం అదజేశారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు పూజన్న స్వామి, ఉమేష్ స్వామి, దేవస్థాన సిబ్బంది ఉమేష్ పాల్గొన్నారు.
ఉరుకుందలో విరాళం అందిస్తున్న భక్తులు










