ప్రజాశక్తి - నూజివీడు రూరల్
మండలంలోని సీతారామపురం గ్రామానికి చెందిన పర్వతనేని రాజేంద్రకుమార్ అన్నామలై యూనివర్సిటీ పిహెచ్‌డి డాక్టరేట్ అవార్డు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో అందుకున్నారు. ఆప్టిమైజేషన్ అసిస్టెడ్ ఎఐ బేస్డ్ మోడల్స్ ఫర్ హార్ట్ డిసీజ్ ప్రిడిక్షన్ అనే సాంకేతిక అంశంపై పరిశోధన చేసి ప్రచురించిన హొసిద్ధాంత గ్రంధం నిపుణల కమిటీ పరిశీలన తరువాత అధికారుల ఆమోదముద్ర పొందింది. తన పరిశోధనలో రూపొందించిన పలు పరిశోధన పత్రాలు వివిధ అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. ఆయనకు అవార్డు రావటంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.










