Sep 24,2023 18:13

ప్రజాశక్తి-రామచంద్రపురం
స్థానిక రాజారత్న కిట్స్‌ కళాశాల్లో రెండు రోజులపాటు నిర్వహించిన జాతీయస్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌ ఆదివారంతో ముగిసింది. ముగింపు సభలో కళాశాల డైరెక్టర్‌ ఎం పవన్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రధానమంత్రి పిలుపుమేరకు మేడ్‌ ఇన్‌ ఇండియా మేక్‌. ఇన్‌ ఇండియా నినాదంతో ఈ కార్యక్రమం ఏర్పాటుచేశామన్నారు. గమంత్ర అనే పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి సైన్స్‌ ఎగ్జిబిషరన్‌లో 50 పైగా సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ నూతన ఆవిష్కరణలు ప్రదర్శించారన్నారు. ఈ సందర్భంగా పరిశోధకులకు ప్రశంసాపత్రాలను జ్ఞాపికలను అందజేశారు. కళాశాల ప్రిన్సిపల్‌ బర్ల వెంకట్‌ మాట్లాడుతూ సైన్స్‌ పరిశోధనలో ప్రథమ, ద్వితీయ, తతీయ స్థానాలకు ఎంపికైన వారికి కన్సోలేషన్‌ బహుమతులను ప్రకటించామన్నారు. వీటిని అక్టోబర్‌ 2 గాంధీ జయంతి రోజున హైదరాబాదులో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేస్తామన్నారు. డైరెక్టర్లు రామారావు, రవీందర్‌, శ్రీకాంత్‌, లు పరిశోధకులను అభినందించి, మరిన్ని నూతన ఆవిష్కరణలతో దేశానికి , ప్రజలకు ఉపయోగపడే విధంగా కషి చేయాలన్నారు. కాకినాడ జెన్‌టియు వైస్‌ ఛాన్స్‌లర్‌ నుంచి ప్రశంస పత్రాలను పరిశోధకులకు అందజేశారు. వీరితో పాటుగా కిట్స్‌ కళాశాల ఇంజినీరింగ్‌ విద్యార్థులు రూపొందించిన ఆధునిక సైన్స్‌ పరికరాలను ప్రదర్శించారు. వీరందరిని కళాశాల అధ్యాపకులు, డైరెక్టర్లు అభినందించారు.