Mar 24,2023 00:40
బాపట్లలో రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ప్రజాశక్తి-బాపట్ల: జాతీయ కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ అరెస్టుకు నిరసనగా బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్‌ సెంటర్లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. గురువారం బాపట్ల జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు గంటా అంజిబాబు, పట్టణ పార్టీ అధ్యక్షుడు డి దేవరాజు ఆధ్వర్యంలో పాత బస్టాండ్‌లో నడిరోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పఠాన్‌ రాజేష్‌, బక్కా రోశయ్య, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.