Nov 02,2023 22:28

రాహు-కేతు పూజల్లో రష్యన్లు

రాహు-కేతు పూజల్లో రష్యన్లు
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహించే రాహు-కేతు పూజల్లో గురువారం 20 మంది రష్యా దేశస్థులు పాల్గొన్నారు. మొదట ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికారు. రాహు-కేతు పూజల అనంతరం రష్యా దేశస్థులకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని శిల్ప సంపదను చూసి రష్యా దేశస్థులు ఆనందం వ్యక్తం చేశారు.