ప్రజాశక్తి - భట్టిప్రోలు
మండలంలోని పెద్దపులి పంచాయతీలోని కోళ్లపాలెంకు చెందిన సిపిఎం సానుభూతిపరుడు చీకటి రాఘవులు గత మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి, జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య శనివారం రాఘవులు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ రాఘవులు పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని అన్నారు. తుది శ్వాస విడిచే వరకు పార్టీ సానుభూతిపరుడుగా ఉన్నారని అన్నారు. లంక భూముల భూ పోరాటంలో ముఖ్యపాత్ర పోషించారని అన్నారు. ఆయన ఆశయాలను సాధించాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టి కృష్ణమోహన్, నాయకులు మురుగుడు సత్యనారాయణ, జి నాగరాజు, బి సుబ్బారావు, నాగమల్లేశ్వరరావు ఉన్నారు.










