Jul 09,2023 20:47

శ్రీమఠంలో ఉన్న భక్తులు

ప్రజాశక్తి - మంత్రాలయం
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో కొలువైన శ్రీరాఘవేంద్రస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో కోలాహలం నెలకొంది. ఆదివారం రాఘవేంద్రుని దర్శనార్థమై దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గ్రామ దేవత మంచాలమ్మను, రాఘవేంద్రుని మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, సేవలు చేయించిన భక్తుల సమక్షంలో రాఘవేంద్రుని బృందావన ప్రతిమకు శ్రీమఠం దివాన్‌ సుధీంధ్రాచార్‌ విశేష పూజలు నిర్వహించారు. అనంతరం బృందావనాన్ని స్వర్ణపల్లకిలో ఉంచి వేద మంత్రాలు, మంగళ వాయిధ్యాల నడుమ పల్లకి సేవ చేయించిన భక్తులతో పల్లకి మోయించి శ్రీమఠం ప్రాకారంలో పల్లకోత్సవం నిర్వహించారు. ఊయల మండపంలో పండితులు ఊయల సేవ నిర్వహించారు.