Jun 03,2023 19:20

మంత్రికి మెమొంటో అందజేస్తున్న పీఠాధిపతులు

ప్రజాశక్తి - మంత్రాలయం
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో కొలువైన శ్రీరాఘవేంద్రస్వామిని కర్ణాటక రాష్ట్ర జలవనరుల శాఖలోని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి ఎన్‌ఎస్‌.బోసరాజు దర్శించుకున్నారు. శనివారం దర్శనార్థం ఆలయం చేరుకున్న ఆయనకు శ్రీమఠం మేనేజర్‌ ఎస్‌కె.శ్రీనివాసరావు, ఆధ్యాత్మిక అభివృద్ధి అధికారి శ్రీపతి ఆచార్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపి.నరసింహ మూర్తి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను, రాఘవేంద్రుని మూల బృందావనాన్ని దర్శించుకుని మంగళ హారతులు స్వీకరించారు. అనంతరం శ్రీమఠం పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు ఆయనను కుశల ప్రశ్నలు వేసి, మెమొంటో అందజేసి ఆశీర్వదించారు.