Aug 21,2022 22:34

పాటలు పాడుతున్న గాయకులు

ప్రజాశక్తి-విశాఖపట్నం : రాగమాలిక 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం విశాఖ పౌర గ్రంథాలయంలో 146 మాసపు గీత మాలిక కార్యక్రమం నిర్వహించారు. సంస్థ కార్యదర్శి కెవి సత్యనారాయణ నిర్వహణలో గాయకులు నాగు, మహమ్మద్‌ ఖాన్‌, చింతపల్లి సత్యనారాయణ, భరద్వాజ్‌, జి.సత్యనారాయణ, శ్రీనివాసరెడ్డి, గాయనీమణులు అంజలి, మీనా కుమారి, శైలజ తదితరులు గీతాలు ఆలపించారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్ర ఆర్టిస్ట్‌ డైరెక్టర్‌ సన్‌ మూర్తి, గాయకుడు వెంకటేష్‌, ఎడిటర్‌ చింత ప్రభాకర్‌, రిటైర్డ్‌ ఎడిసిపి మహమ్మద్‌ ఖాన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని రాగమాలిక కార్యక్రమాలను ప్రశంసించారు.