రాగిజావాతో విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యం
డోన్ : విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రభుత్వం రాగిజావాను ప్రతిరోజు ఉదయం పాఠశాలలో అందిస్తుందని మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ పేర్కొన్నారు. డోన్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో, రైల్వే స్టేషన్ రోడ్‌లో ఉన్న హైస్కూల్లో రాగిజావాను విద్యార్థులకు అందించే కార్యక్రమంను మున్సిపల్ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్‌ఎండి.జాకీర్ హుస్సేన్,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు రాగి జావ అందించిన రాష్ట్ర మీట్ కార్పొరేషన్ శ్రీరాములు
జడ్పి ఉన్నత పాఠశాల పాతపేట డోన్ నందు నిర్వహించిన రాగి జావ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు, జెడ్పీటీసీ బద్దల రాజ్ కుమార్ హాజరై విద్యార్థులకు రాగి జావను అందించారు. అనంతరం వారు మాట్లాడారు. మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, ఎంఇఒ ప్రభాకర్, మున్సిపల్ వైస్ చైర్మన్ జాకీర్ హుస్సేన్, ప్రధానోపాధ్యాయులు పద్మావతమ్మ, తదితరులు పాల్గొన్నారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు చిరుధాన్యాలను తీసుకోవాలి
- ఐసిడిఎస్ సిడిపిఓ షంషాద్ బేగం
పౌష్టికాహారలోపాన్ని రక్తహీనతను తగ్గించుకోవడం కోసం గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలని ఐసిడిఎస్ సిడిపిఓ షంషాద్ బేగం పేర్కొన్నారు. డోన్ పట్టణంలోని స్థానిక శ్రీరామ్ నగర్‌లో మూడవ అంగన్వాడి సెంటర్ నందు పౌష్టికాహారలోపం, రక్తహీనత కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ షంషాద్ బేగం మాట్లాడారు. చిరుధాన్యాలలో ఐరన్ శాతం ఎక్కువగా ఉండడంతో రక్తహీనత రాకుండా ఉండడానికి తోడ్పాటు అందిస్తాయన్నారు. అంగన్వాడి కేంద్రంలో ఇచ్చే వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్టును కచ్చితంగా తినాలని సూచించారు. ఈనెల 20వ తేదీ నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్స్, వైద్య, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
రాగి జావతో క్యాల్షియం పుష్కలం : సర్పంచ్
బండి ఆత్మకూర్ : రాగిజావ అందించడం ద్వారా విద్యార్థులకు క్యాల్షియం పుష్కలంగా అందుతుందని, రాగిజావ ద్వారా వేసవి తాపం తీరుతుందని సర్పంచ్ కాలూరి శ్వేతకుమారి, వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాలూరి ప్రసాద్ పేర్కొన్నారు. ఎర్రగుంట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు రాగిజావ అందించే కార్యక్రమంలో వారు మాట్లాడారు. కార్యక్రమంలో హెచ్‌ఎం విశ్వనాథరెడ్డి, ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, నాగేశ్వర్రెడ్డి, బాలశివయ్య, నిర్మలమ్మ, ఇమ్రాన్, విజయ రాణి, రేఖ, తదితరులు పాల్గొన్నారు. ప్యాపిలి: విద్యార్థులకు రాగి జావా కార్యక్రమా న్ని జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జెడ్పీటీసీ బోరెడ్డి శ్రీరామరెడ్డి, ఎంఈఓ శ్రీనివాసులు ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయు రాలు విజయ నిర్మల,ఉపాద్యాయులు పాల్గొన్నారు. చాగలమర్రి: పట్టణంలో జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఎంపీపీ రామిశెట్టి వీరభద్రుడు, తహసీల్దారు విజరు కుమార్, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంఈవో అనురాధ రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల ఉపాధ్యక్షులు ముల్లా రపి, ప్రధానోపాధ్యాయులు కోటయ్య, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు అబ్దులా పాల్గొన్నారు. పాములపాడు: మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల్లో విద్యార్థులకు రాగిజావ కార్యక్రమాన్ని ఎంఈఓ బాలాజీ నాయక్ ప్రారంభించారు. భానుముక్కల గ్రామంలో సచివాలయం నందు చిరుధాన్యాలతో తయారుచేసిన వంట కాలను ప్రదర్శించారు. మహిళా పోలీస్ తస్లీమా, అంగన్వాడి టీచర్లు స్వాతి, మునెమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: రాగిజావ కార్యక్రమం ప్రారంభిస్తున్న కౌన్సిల్ లక్ష్మమ్మ
ఆత్మకూరు: ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోనీ 21వ వార్డులో వెంగలరెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు రాగిజావ పంపిణీని కౌన్సిలర్ బోయ లక్ష్మమ్మ ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయుడు నాయక్, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.










