జనసేన అధినేత పవన్ కళ్యాణ్
ప్రజాశక్తి - నరసాపురం/పాలకొల్లు
రాబోయే ఎన్నికలు జనసేనకు చాలా కీలకమని, ప్రతిఒక్కరూ కష్టపడి పార్టీ విజయానికి కృషి చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. నరసాపురంలోని రారుపేటలో సోమవారం ఆయన నియోజకవర్గంలోని పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోకి మీడియాను అనుమతించలేదు. సమావేశంలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొమ్మిడి నాయకర్‌తోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. జనసేన కార్యకర్తలు పట్టణంలో మోటార్ సైకిళ్లపై హల్‌చల్ చేశారు.










