- డాక్టర్ జయప్రకాష్
ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : నడక భయంతో బిపి షుగర్ రక్తపోటు వ్యాధుల నుండి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని.. తిరుపతి. నరాలకు సంబంధించిన వైద్య నిపుణులు డాక్టర్ జయప్రకాష్ పేర్కొన్నారు. పుత్తూరు వాకర్ అసోసియేషన్ సమావేశం భవనంలో అధ్యక్షులు రామచంద్ర నాయుడు. గౌరవ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి. డాక్టర్ రవి రాజు ఆధ్వర్యంలో సమావేశము నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ జయప్రకాశము ఘనంగా పూలమాలతో శాలువా కప్పి బహుమతులు ఇచ్చి సన్మానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జయప్రకాష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఒక గంట పాటు నడక వ్యాయామం చేయాలని అప్పుడే బీపీ మధుమేహం రక్తపోటు. రాకుండా ఉపసంహనం పొందుకోవచ్చని బిపి షుగర్ ఉన్నవారు కొంతవరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆహారం పట్ల శ్రద్ధ చూపాలని అప్పుడే మధుమేహం నివారణ పొందుకోవచ్చని నరాల బలహీనత ఉన్నవారు క్రమముగా వైద్య పరీక్షలు చేసుకొని మందులు తీసుకోవాలని అన్నారు. హైపర్ టెన్షన్. ఉంటే గుండెపోటు వచ్చేందుకు ఆస్కారంగా ఉంటుందని అన్నారు. గుండెపోటు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ల దగ్గరకు వెళ్లి వైద్య పరీక్షలు పొందుకోవాలని నిర్లక్ష్యం చేస్తే. ప్రాణానికి ముప్పు వస్తుందని కాబట్టి ఆరోగ్యంపై జాగ్రత్త పడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్ అసోసియేషన్ కార్యదర్శి రఘునాథరెడ్డి. గోపికృష్ణ. మాజీ అధ్యక్షులు మురుగేషన్ రెడ్డి, రామ్మోహన్ రాజు, ద్వారకనాథ్ శెట్టి, కుప్పయ్య శెట్టి, కె ఎల్ మూర్తి, యుగంధర్ రాజు, వాకర్ సభ్యులు పాల్గొన్నారు










