Jul 23,2021 12:25

గుంటూరు : ఎగువన కురుస్తోన్న వర్షాల కారణంగా... పులిచింతల ప్రాజెక్టులో వరద ఉధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి 62 వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. ప్రస్తుతం మూడు గేట్లు ఎత్తి 52,393 క్యూసెక్కుల నీటికి కిందికి వదులుతున్నారు. మరోవైపు విద్యుదుత్పత్తి కోసం 10 వేల క్యూసెక్కుల నీటిని మళ్లించారు. పులిచింతల జలాశయం పూర్తిసామర్థ్యం 45.77 టిఎంసి లు కాగా.. ప్రస్తుతం 44.03 టిఎంసి ల నీరు నిల్వ ఉంది. కఅష్ణా నదిలోకి నీటిని విడుదల చేస్తుండటంతో పరీవాహక ప్రాంత గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.