Sep 20,2023 15:44
  • రెడ్డి జేఏసీ సభ్యులు ఫిర్యాదు

ప్రజాశక్తి-కలికిరి : రాజకీయ కక్షతోనే అమాయకులపై కేసుల నమోదు చేసి వేధిస్తున్నారని రెడ్డి జేఏసీ సంఘం ఆధ్వర్యంలో మదనపల్లి డిఎస్పి  కే కేశప్ప కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెలలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా అంగళ్లు, పుంగనూరులో చోటుచేసుకున్న సంఘటనలకు బాధితులను చేస్తూ అమాయకులపై కేసు నమోదు చేస్తున్నారని దీన్ని రెడ్డి జేఏసీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. కలికిరి మండలంలో ఇప్పటికే ఎలాంటి అన్యంపుణ్యం ఎరగని అమాయకులైన14 మంది రెడ్డి జేఏసీ సభ్యులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారని అంగళ్ళు సంఘటనలప్పుడు వారు వారి వారి సొంత పనులు నిమిత్తం కలికిరి, పీలేరు ప్రాంతాల్లోనే ఉన్నారని, దీనికి సంబంధించిన సాక్ష్యాలు సీసీ కెమెరాల ద్వారా అందుబాటులో ఉన్నాయని వాటిని నిశితంగా పరిశీలించి అమాయకులైన రెడ్డి జేఏసీ సభ్యులను అక్రమ కేసుల నుండి విముక్తి చేయవలసిందిగా డీఎస్పీని కోరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జేఏసీ అధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి, కార్యదర్శి రాంప్రసాద్ రెడ్డి, సభ్యులు శేషు కుమార్ రెడ్డి, సహదేవరెడ్డి, వెంకటనారాయణ రెడ్డి, రాజారెడ్డి, ప్రతాపరెడ్డి తదితరు రెడ్డి జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.