
- పొదిలి టైలర్స్ కాలనీ వాసులు.
ప్రజాశక్తి-పొదిలి : గొంతు ఎండుతున్న పట్టించుకునే నాధుడు లేడా ఇది దారుణం టైలర్స్ కాలనీ వాసులు అంటున్నారు. మా దాహం అర్తనాధలు ఎవరికీ వింటారని వారు బోరున విలపిస్తున్నారు. రెండు కిలోమీటర్లు పోయి త్రాగునీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పొదిలి- ఒంగోలు-కర్నూల్ జాతీయ రహదారి పక్కన ఉన్న టైలర్స్ కాలనీలో ప్రజల గొంతు ఎండుతున్నదని తెలిపారు. సంవత్సరాలు గడుస్తున్న నాయకులు, అధికారులు నీళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఖాళీ బిందెలతో టైలర్స్ కాలనీ వాసుల నిరసన చేపట్టారు. ఓట్లు అడగడానికి వస్తారు కానీ మాకు న్యాయం చేయరు అంటూ టైలర్స్ కాలనీ వాసుల ఆవేదన వ్యక్తం చేశారు. తమ అవసరాలు తీర్చనపుడు, తమని పట్టించుకోనప్పుడు ఓట్లు వేయమని తెలిపారు. 'మా బతుకులు ఇంతే.. మమ్మల్ని ఎవరు ఆదుకోరు.. అంటూ టైలర్స్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.