ప్రజాశక్తి-వత్సవాయి: వత్సవాయి మండలంలో డప్పు కళాకారులు గుర్తింపు కార్డులు ఉన్నవారికి డప్పులు, గజ్జలు, మరియు డ్రస్సులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ డప్పుకు కళాకారుల సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎం కుటుంబరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గుర్తింపు కార్డులో ఉన్న డప్పు కళాకారులకు అందరికీ డబ్బుకులు, గజ్జలు డ్రస్సులు ఇవ్వాలని సోమవారం తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం పెట్టారు ఆందోళన కార్యక్రమంలో ఎంపీడీవో, ఎమ్మార్వోకు వినతి పత్రాలు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి ఎం కుటుంబరావు మాట్లాడుతూ వత్సవాయి మండలంలో డప్పు కళాకారులకు రెండు సంవత్సరాల క్రితం ద్వారా డప్పు కళాకారులకు డప్పుకులు, గజ్జలు, డ్రెస్సులు కంపెనీ పంపిణీ చేయకుండా మండల పరిషత్ కార్యాలయంలో ఉన్నాయని, అధికారులకు గతంలో ఎన్నోసార్లు అర్జీలు సమర్పించిన స్పందించకపోవడంతో నేడు తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆందోళనకు స్పందించిన ఎంపీడీవో ఎస్ వి ప్రసాద్ మాట్లాడుతూ వారం రోజుల్లో గ్రామ సచివాలయాల ద్వారా గ్రామాల వారిగా అర్హులందరికీ డప్పు కులు, గజ్జలు, డ్రస్సులు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తాసిల్దార్ వినతి పత్రం సమర్పించారు. వత్సవాయి ఎస్సై బడవత్ అభిమన్య ఆందోళన కార్యక్రమాన్ని విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో డప్పు కళాకారుల సంఘం మండల అధ్యక్షులు గుడేటి ఆధం, సిఐటియు మండల కార్యదర్శి బి రాము, డప్పు కళాకారులు కళాకారులు నాగేశ్వరరావు, బెంజిమెన్, వెంకటరత్నం, రాములు, యేసు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు*










