May 17,2023 12:17
  • మంచినీరు సౌకర్యం కల్పించాలి : గిరిజన సంఘం.

ప్రజాశక్తి-అల్లూరి సీతారామరాజు జిల్లా : డుంబ్రిగుడ మండలం గుంటసీమ పంచాయతీ సరియవలస గ్రామంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో మంచినీరు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆందోళన చేయడమైన్నది. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.సూర్యనారాయణ మాట్లాడుతూ మూడు సంవత్సరాల క్రితం సరియవలస గ్రామంలో సుమారు15లక్ష రూపాయలతో జాతీయ గ్రామీణ త్రాగునీటి పథకం, సౌరవిద్యుత్ ఆదారిత పంపు సోలార్ ప్యానల్ మరియు పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ సహాయంతో నిర్మించారు. సౌరవిద్యుత్ సోలార్ పంపు మరమ్మతులు గురౌవడంతో నీరు లేక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచినీరు కోసం కిలోమీటరు దూరంలో పోలాం సమీపంలో నిర్మించిన కుండిల్లో నిల్వ ఉన్నకలుషితమైన బురద నీరు వాడుతున్నారు. ఎండలు తీవ్రత వలన ఉన్న కలుషితమైన్న నీరు కూడా ఇంకిపోయె పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు స్వందించి వెంటనే మరమ్మతులకు గురైన సౌరవిద్యుత్ సోలార్ పంపు మిషన్ బాగుచేసి సరియవలస గ్రామంలో మంచినీరు సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో. గిరిజన సంఘం నాయకులు పాంగి. తిలక్.కొర్ర.రామానాయుడు, గోల్లోరి. ధాన్యాలు, పాంగి.హరిశ్చంద్ర, కీల్లో.కర్రిబుడ్డి, పాంగి ప్రమీల, గోల్లోరి ముక్తకొర్ర.లక్ష్మీ. తదితరులు పాల్గొన్నారు.