ప్రజాశక్తి-అల్లూరి : మాదల పంచాయితీ రక్షణ ఈ నెల 23న బహిరంగ సభకు తరలిరండి దాబుగుడ గ్రామస్తులు మా అనుమతి లేకుండా మా కొండ కోసం దొంగతనం సంతకం చేసిన అధికార పార్టీ నాయకులను పంచాయతీ నుంచి తరిమికొట్టాలని దాబుగుడ గ్రామస్తులు పిలుపునిచ్చారు. 2019 నుంచి తాము బాక్సైట్ వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంటే కొంత మంది దొంగతనంగా సర్వే నిర్వహిస్తున్నారన్నారు. తాము ఈ కొండమీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని, అదే ఊటగడ్డలో నీరు ఉపయోగించుకుంటున్నామని పంట పొలాలకు ఇదే నీరు ఉపయోగిస్తున్నామని తమ అనుమతి లేకుండా సర్వేలు నిర్వహిస్తున్న నాయకులను సహించేది లేదని డాబుగుడ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గిరిజన సంఘం పంచాయతీ ప్రధాన కార్యదర్శి కుమిడి రమేష్ మాట్లాడుతూ 2019 నుంచి ఆగమేఘాలుగా క్వార్డ్జ్ బాక్సైట్ తీయాలని కొంతమంది నాయకులు ప్రయత్నం చేస్తున్నారని తమ గ్రామస్తులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు కూడా సమాచారం ఇవ్వకుండా దొంగ సంతకాలు పెట్టి ప్రయత్నం చేస్తున్నారని ఇటువంటి నాయకులను పంచాయతీకి ఉండడానికి అర్హత లేదన్నారు. ఈనెల 23న జరుగుతున్న బహిరంగ సభకు రావాలని, క్వార్డ్జ్ బాక్సైట్ ఎట్టి పరిస్థితిలో తీయడానికి అవకాశం లేదని గ్రామస్తులు అందరు కూడా తేల్చి చెప్పడం జరుగుతుందని అన్నారు. బాక్సైట్ జోలికి వస్తే ఎవరైనా సరే తరిమి తరిమి కొడతామని గ్రామస్తులము ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఇకపై నుంచి తమ కొండపైన సర్వేకి ఎవ్వరూ వచ్చిన సహించేది లేదని ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నాయకులు తమ కొండ జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరిరించారు. గిరిజన సంఘం నాయకులు ప్రసాద్ ఎస్ సొన్ను మాజ్జి వార్డ్ నెంబర్ దాబుగుడ గ్రామస్తులు పి రామ్ కోములు ,రాము, గెన్ను బాబు జగన్నాధం సుంక్ర తదితరులు పాల్గొన్నారు










