May 25,2023 15:12

ప్రజాశక్తి-పెదబయలు : డా.అంబేద్కర్ కూడలిలో స్థానిక అటవీశాఖ రేంజ్ అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నము ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు 10వరోజు ప్రపంచం పర్యావరణ పరిరక్షణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ రేంజ్ కార్యాలయము నుండి పురవీదుల మీదుగా అవగాహనా  బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటా మొక్కలు నాటండి  చెట్లను పెంచండి ప్లాస్టిక్ వాడకం నిరోదించండి  ఇందనం, విద్యుత్ వినియోగించడం తగ్గించండి కాలుష్యం నీవరించండి అంటూ నినాదాలు చేసారు. ఈకార్యక్రమంలో బీట్ అధికారులు స్థానిక వైస్సార్సీపీ నాయకులు మాజీ జడ్పీటీసీ  కొంటా సూర్యనారాయణ   సందడి కొండబాబు తదితరులు పాల్గొన్నారు.